తొలి శుభోదయం అమరావతి :-

ఎస్సి సబ్ ప్లాన్ నిధులు 100 శాతం ఖర్చు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. గురువారం నాడు వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో మంత్రి డిఎస్ బీవీ స్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సి సబ్ ప్లాన్ నిధులు, ఎస్సి అట్రాసిటీ బాధితులకు పరిహారం, నూతన హాస్టళ్ల నిర్మాణం, హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, అడ్మిషన్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఎస్సి సబ్ ప్లాన్ నిధుల వినియోగానికి యాక్షన్ ప్లాన్ రూపొందించి 100 శాతం నిధులు ఖర్చు చేయాలి. వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని హాస్టళ్లలో అడ్మిషన్లు 100 పూర్తి కావాలి. పీఎం అజయ్ కింద నిర్మిస్తున్న నూతన హాస్టళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి. సంక్షేమ హాస్టళ్లు, అంబేద్కర్ గురుకులాల్లో త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అద్దె భవనాల్లో ఉన్న హాస్టళ్లకు శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *