తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ,జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా ఒంగోలు డీఎస్పీ పర్యవేక్షణలో, ఒంగోలు టౌన్ పరిధిలోని లాడ్జీలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది. ఈ తనిఖీల్లో ఒంగోలు టౌన్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఈ ప్రత్యేక తనిఖీల సందర్భంగా వివిధ లాడ్జీల్లో మొత్తం 26 జంటలను గుర్తించగా, ఒంగోలు డీఎస్పీ వారిని వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ చేసి, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. చట్ట పరిమితుల్లో ఉండి, సమాజ శాంతికి భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.లాడ్జీలను దుర్వినియోగం చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. పట్టణంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.ప్రజలు పోలీసులకు సహకరించి, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112కు తెలియజేయాలని కోరారు.