తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , జిల్లాలో బాలికల భద్రత, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఒంగోలు ప్రభుత్వ బాలికల హాస్టల్‌లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) (Anti Human Trafficking Unit) బృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా బాలికలకు మానవ అక్రమ రవాణా వల్ల కలిగే ప్రమాదాలు, బాల్య వివాహాల దుష్పరిణామాలు మరియు చట్టపరమైన శిక్షలు, అలాగే Good Touch & Bad Touch మధ్య తేడా వంటి కీలక అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు. అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే భయపడకుండా వెంటనే హాస్టల్ సిబ్బంది, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాలికలు తమ హక్కులను తెలుసుకొని ధైర్యంగా ముందుకు రావాలని, అవసరమైన సమయంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని AHTU బృందం భరోసా ఇచ్చింది. బాలికల భద్రత, చైతన్యం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *