తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రజల ప్రాణ భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని, రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలు ఫ్లైఓవర్ పాయింట్ వద్ద దెబ్బతిన్న రోడ్లు మరియు గుంతల మరమ్మతు పనులను చేపట్టారు.ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన RSI శివ ప్రసాద్ పర్యవేక్షణలో ఈ మరమ్మతు పనులు నిర్వహించబడ్డాయి. ఫ్లైఓవర్ వద్ద గుంతల కారణంగా వాహనదారులకు ఏర్పడుతున్న ప్రమాదాలను నివారించి, ట్రాఫిక్ సాఫీగా మరియు సురక్షితంగా సాగేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సురక్షిత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతకు సంబంధించిన చర్యలను నిరంతరం కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *