తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, శాంతి భద్రతలను బలోపేతం చేయడం మరియు నేరాల నివారణ లక్ష్యంగా ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడు నడత గల వ్యక్తులకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్న వారికి చట్టపరమైన అవగాహన కల్పిస్తూ, నేరప్రవర్తన నుండి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. తిరిగి నేరాలకు పాల్పడే పరిస్థితుల్లో కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో సజ్జన పౌరులుగా మారి తమ కుటుంబ భవిష్యత్‌ను సురక్షితం చేసుకోవాలని కూడా సలహా ఇచ్చారు.సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడం, కుటుంబ బాధ్యతలు, ఉపాధిలో స్థిరత్వం సాధించడం తదితర అంశాలపై కూడా మార్గదర్శకాలు అందించారు.