తొలి శుభోదయం కందుకూరు:-
కళలకు కాణాచి మన కందుకూరు. మన ప్రాంతానికి చెందిన చిన్నారులు నాట్య ప్రదర్శనతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడం మనందరికీ గర్వకారణం.గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన ‘కూచిపూడి కళావైభవం – 2’లో కందుకూరుకు చెందిన ‘శ్రీ నటరాజ నాట్యమండలి’, ‘సరస్వతి నిలయం’కు చెందిన 16 మంది చిన్నారులు అద్భుత ప్రదర్శనతో ఈ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఈ రోజు కందుకూరులోని మన టీడీపీ కార్యాలయంలో ఆ చిన్నారులను, వారికి శిక్షణ ఇచ్చిన గురువులు శ్రీమతి తిరుమల శెట్టి వెంకట దత్తేశ్వరి, శ్రీ ప్రేమ్ కుమార్ గార్లను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఘనంగా సత్కరించుకోవడం జరిగింది.భావితరాలకు మన సంస్కృతీ సంప్రదాయాలను అందిస్తున్న వీరి కృషి అభినందనీయం. ఈ చిన్నారులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.