తొలి శుభోదయం కందుకూరు:-

ఈ కార్యక్రమంలో ప్రజలు, కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు.ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ…“కందుకూరు ప్రజల ఎన్నేళ్ల ఆశయం నెరవేరిన బుధవారం ఇది. మన ప్రాంతం తిరిగి ప్రకాశం జిల్లాలో కలవడం కేవలం పరిపాలనా మార్పు మాత్రమే కాదు—ఇది మన స్వాభిమానానికి, మన హక్కులకు లభించిన గౌరవం. ఈ నిర్ణయంతో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయి, ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయి. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కి, కూటమి నాయకులకు కందుకూరు ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపై కందుకూరు ను అభివృద్ధి దిశగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసి నడవాలి” అని అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *