తొలి శుభోదయం కందుకూరు:-

స్థానిక పామూరు రోడ్డు నందు గల కందుకూరు పబ్లిక్ స్కూల్ నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ డి. బాల బ్రహ్మంగారు జాతీయ జెండాను ఎగురవేశారు, తదనంతరం పాఠశాల కరస్పాండెంట్ పి. వేణుగోపాల్ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును రిపబ్లిడేగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుండే దేశం పట్ల దేశభక్తిని కలిగి ఉండాలని, విద్యలో రాణించి మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గ స్థాయిలో APPSUME’S వారు నిర్వహించిన టాలెంట్ టెస్టులో మొదటి స్థానం సాధించిన పదవ తరగతి విద్యార్థిని ఏ.వైశాలిని అభినందించి జ్ఞాపికను బహుకరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డీన్ టి. పద్మావతి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *