తొలి శుభోదయం కందుకూరు:-

గత వారంలో కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త మెడికల్ సూపరింటెండ్‌గా డాక్టర్ ఇంద్రాణి నియమితులైన సందర్భంగా
మంగళవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన ఆమె, ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.డాక్టర్ ఇంద్రాణి మాట్లాడుతూ, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది, వైద్యులతో సమన్వయం పెంచి కొత్త వైద్య సేవలను తీసుకురావడానికి కృషి చేయడంతో పాటు కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తాను అని సేవా కార్యక్రమాల్లో పారదర్శకత, రోగుల సమస్యల పరిష్కారం, అత్యవసర సేవల బలోపేతానికి కృషి చేస్తానని ఇంద్రాణి హామీ ఇచ్చారు. కందుకూరు ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ బాధ్యతలు స్వీకరించిని డాక్టర్ ఇంద్రాణి ని ఆసుపత్రి సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *