తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో, కంభం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారు, అతివేగంగా వాహనాలు నడిపే వారు, రాంగ్ రూట్ (ఓపోజిట్ డ్రైవింగ్) చేసే వాహనదారులను నిలిపి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అలాగే వాహనాల రికార్డులను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టప్రకారం జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రజల సహకారం అత్యంత అవసరమని ఎస్సై తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *