తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి డీఎస్పీ శ్రీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్ సబ్‌ డివిజన్ పరిధిలోని అన్ని ఎస్ఎచ్ఓలతో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.సమావేశంలో ఇటీవల చోటుచేసుకున్న నేరాల ధోరణులు, పెండింగ్ కేసుల పురోగతి, నివారణ చర్యలు వంటి అంశాలను సమీక్షించారు.
అన్ని పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ గారు ఆదేశించారు.అదనంగా, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక వాహన తనిఖీలు, కంట్రోల్ డ్రైవ్‌లు నిర్వహించాలి, ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి అని సూచించారు.ప్రజల భద్రత, చట్ట–సంవిధాన పరిరక్షణ పట్ల పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *