తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు తమ సేవాభావాన్ని మరోసారి చాటుకున్నారు.కనిగిరి నుండి విజయవాడకు వెళ్లే RTC బస్సులో ఒక మహిళా ప్రయాణికురాలు తన బ్యాగ్‌ను (దీనిలో మొబైల్ ఫోన్ మరియు పర్స్ ఉన్నాయి) తప్పిపోయిందని RTC అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ సమాచారం వెంటనే ఒంగోలు ట్రాఫిక్ పోలీసులకు చేరడంతో, RSI శివప్రసాద్ నేతృత్వంలో టీమ్ అప్రమత్తమైంది.నార్త్ బైపాస్ ట్రాఫిక్ పాయింట్ వద్ద ఆ బస్సును అడ్డగించగా, బ్యాగ్‌ను సురక్షితంగా గుర్తించి, వివరాలు ధృవీకరించిన అనంతరం సంబంధిత మహిళా ప్రయాణికురాలికి అప్పగించారు.
ప్రజల ఆస్తి భద్రతపై ట్రాఫిక్ పోలీసుల త్వరిత స్పందన, నిబద్ధతను ప్రయాణికులు మరియు RTC సిబ్బంది అభినందించారు.