తొలి శుభోదయం ఉలవపాడు:-
ఉలవపాడులోని బృందావనం లేఔట్ లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు బుధవారం జరిగాయి. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తనయుడు సందీప్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను తిలకించారు. పోటీల్లో మొత్తం 32 టీమ్ లు పాల్గొనగా…. చినగంజాం బికేస్ స్పోర్ట్స్ క్లబ్ విజేతగా నిలిచింది. బృందావనం లేఅవుట్ కమిటీ టీమ్, నెల్లూరు అకాడమీ టీమ్, కరేడు టెంకాయచెట్లపాలెం టీమ్ లు తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఈ నాలుగు టీం లకు ఇంటూరి సందీప్ నగదు బహుమతులు అందించారు. చినగంజాం టీం కు దాత భోగినేని చెంచురామానాయుడు ప్రకటించిన 25,116 రూపాయలను సందీప్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉలవపాడు మండల టిడిపి అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
