తొలి శుభోదయం కందుకూరు:-
చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సతీమణి సౌజన్య, కుమారులు అవినాష్, సందీప్ లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆలయ పండితులు ఆశీర్వాదాలు అందజేశారు. తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందించారు.కందుకూరు నియోజకవర్గంలో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని, ఈ నూతన సంవత్సరంలో ప్రజలకు మేలు జరగాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గణనాథుని ప్రార్థించారు.