తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి అధ్యక్షతన సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ మేనేజ్మెంట్, రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, రికార్డుల అప్డేషన్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.ప్రతి పోలీస్ స్టేషన్లో రికార్డులు క్రమబద్ధంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, కేసులలో ఆలస్యం లేకుండా న్యాయసమ్మతంగా దర్యాప్తు జరగాలని సీఐ సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు.స్టేషన్ స్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.