తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీస్ శాఖలో విధి నిర్వహణలో సమన్వయం, న్యాయపరమైన ప్రక్రియల్లో పారదర్శకత పెంపు లక్ష్యంగా ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. అజయ్ కుమార్ కోర్టు కానిస్టేబుళ్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో కోర్టులకు కేసులు సమర్పించడం, సమన్లు జారీ చేయడం, వాంఛిత నిందితులను కోర్టు ఆదేశాల మేరకు హాజరు చేయించడం, కేసు రికార్డుల సరైన నిర్వహణ, న్యాయపరమైన పత్రాల సమయానికి పంపిణీ వంటి పలు కీలక విషయాలపై చర్చ జరిగింది.
సీఐ అజయ్ కుమార్ కోర్టు కానిస్టేబుళ్లకు సూచిస్తూ—
కోర్టు ఆదేశాల అమలులో ఆలస్యం లేకుండా క్రమశిక్షణతో పనిచేయాలి
కేసుల పురోగతిపై పోలీస్ స్టేషన్లతో సమన్వయం పెంచాలి
ప్రజలకు న్యాయం అందించే ప్రక్రియలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారని గుర్తుంచుకోవాలని తెలిపారు
ప్రజా న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పెంపొందించేలా పోలీసు–కోర్టు వ్యవస్థ మధ్య సమన్వయం అత్యంత అవసరమని అన్నారు.ఈ సమావేశం పోలీస్–కోర్టు వ్యవస్థలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ పనితీరును మెరుగుపర్చడానికి ఎంతో దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *