తొలి శుభోదయం సింగరాయకొండ:-
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ వారి చిత్రపటానికి గౌరవ న్యాయమూర్తి శ్రీమతి డా. వి. లీల శ్యాంసుందరి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులు ప్రతి పౌరుడు గౌరవించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారి సేవలు భారత దేశానికి చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, గురుకుల పాఠశాల విద్యార్థినిలు పాల్గొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు దేశభక్తి వాతావరణంలో ముగిశాయి.
