తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గిద్దలూరు మండల కేంద్రంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించగా, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్య కార్యక్రమం లో మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాషి వెంకట రామాంజనేయులు, సీనియర్ నాయకులు పిడతల రమేష్ రెడ్డి, సీనియర్ నాయకులు కె చంద్ర మోహన్, బాదుల్లా, కొప్పుల నరసింహులు, గిద్దలూరు రూరల్ బీజేపీ అధ్యక్షులు కె వెంకటేశ్వర రెడ్డి,దప్పిలి వినోద్ కుమార్ రెడ్డి,జిల్లా ఎస్ సి మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి మట్టే మల్ల పుల్లయ్య, మునగ నూరి రామక్రిష్ణ, ముప్పూరి శ్రీనివాసులు, సంతోష్ కుమార్, పీరయ్య , శివపురం రవి కుమార్, బండారి జయ ప్రసాద్, కాశి రావు,పార్టీ జెండాను ఆవిష్కరించారు. గిద్దలూరు గాంధీ బొమ్మ సెంటర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పి శెట్టి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ, దేశాభివృద్ధి దిశగా నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వారు తెలిపారు.
అలాగే రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పి.వి.ఎన్. మాధవ్ ఆదేశాలు, జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు సూచనల మేరకు మండల స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పార్టీ స్థాపకులను స్మరించుకున్నారు.
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి పనిచేస్తామని నాయకులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *