తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

గ్రామాల్లో అంతర్గత మరియు లింకు రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సరఫరా, స్మశానాల అభివృద్ధి, ఇతర పనులకు సంబంధించి పెండింగ్ పనులను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పూర్తి చేయాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
స్వర్ణఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా… లింగసముద్రం మండలంలోని 14 పంచాయతీల్లో చెత్త సేకరణకు 16 రిక్షాలను ఎమ్మెల్యే నాగేశ్వరరావు మంగళవారం పంపిణీ చేశారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా అందేలా చేయడం… అధికారులు, నేతల బాధ్యత. ఆ విషయంలో నిర్లక్ష్యంవహిస్తే, అటు ప్రభుత్వానికి, ఇటు తనకు చెడ్డ పేరు వస్తుంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి దగ్గరయ్యేలా పనిచేయాలి అని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామాలలో తాగునీటి అవసరాల కోసం జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా నియోజకవర్గానికి మొదటి విడతగా 30 కోట్లు, రెండో విడతగా 15 కోట్లు మంజూరయ్యాయి. అలాగే చెరువుల అభివృద్ధికి 9 కోట్లు నిధులు వచ్చాయి. గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు నిత్యం అధికారులతో సమీక్షలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలియజేశారు. ప్రభుత్వ పెద్దలు కూడా తాను అడిగిన విధంగానే పెద్ద మనసుతో నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఎంపీడీవో కట్టా శ్రీనివాసులు, మండల టిడిపి అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, గ్రామ పార్టీ అధ్యక్షుడు గాలంకి ప్రసాద్, పార్టీ నాయకులు అడపా రంగయ్య, అర్ధాకుల పెదసత్యం, అడపా నరసయ్య, బింకం నాగేశ్వరరావు, దేవకి సుబ్రహ్మణ్యం, జంపాల శివ, కృష్ణయ్య, వంకాయలపాటి మాల్యాద్రి, ఉన్నం వీరాస్వామి, సోంపల్లి మనోహర్, షేక్ నాయబ్ రసూల్, రాజవరపు మాలకొండయ్య, నీలం బ్రహ్మారెడ్డి, పొలిమేర చిన్ననాగిరెడ్డి, అత్తంటి రంగయ్య, నారిబోయిన నారాయణ, ఎందేటి ప్రసాద్, జనసేన నాయకులు కొణిదల శ్రీను, అన్ని గ్రామ పార్టీలు అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *