తొలి శుభోదయం ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం :-
గ్రూప్ 1 ఫలితాల్లో సాంఘిక సంక్షేమశాఖ అధికారినిగా ఎంపికైన ప్రకాశం జిల్లా కొత్తపట్నం గ్రామానికి చెందిన బేతాల శృతిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ అభినందించారు. గ్రూప్ 1 ఫలితాల్లో విజయం సాధించిన సాధారణ జర్నలిస్టు బేతాల శ్రీనివాసరావు కుమార్తె శృతి ఆదివారం నాడు తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా శృతిని మంత్రి అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ….సాధారణ కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి ఉద్యోగం సాధించడం అభినందనీయమన్నారు. శృతి అకుంఠిత దీక్ష, కృషి, పట్టుదల వల్లే విజయం విజయం సాధించిందని మంత్రి అన్నారు. శృతి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆకాంక్షించారు.