తొలి శుభోదయం కందుకూరు:-
విద్య జీవితాన్ని మార్చింది అనడానికి పరుసు సురేష్, దమ్ము జయసూర్య లే నిదర్శనమని శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ వారు అన్నారు. ఈమధ్య విడుదలైన గ్రూప్ 2 కందుకూరు నియోజకవర్గానికి చెందిన పరసు సురేష్ సబ్ రిజిస్టార్ గా,దమ్ము జయ సూర్య ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా ఎంపికయ్యారు. వీరిరువురిని శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మీడియా చైర్మన్ డా” చక్కా వెంకట కేశవరావు, శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు మాట్లాడుతూ విద్య ఒక్కటే జీవితాన్ని మార్చేస్తుందని అన్నారు. వారికే కాకుండా వారి కుటుంబానికి కూడా సమాజంలో గౌరవం తీసుకుని వస్తుందని అన్నారు. తమ ఉద్యోగాల ద్వారా సమాజానికి మరిన్ని సేవలు అందించాలని వారిని కోరారు. సురేష్, జయ సూర్య మాట్లాడుతూ తాము పేదరికరంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించామని, ప్రతి ఒక్క విద్యార్థి కూడా కష్టపడి చదివి మంచి ఉన్నత స్థితికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ.సి.మెంబర్లు ఇన్నమూరి శ్రీనివాసులు,కోట వెంకటేశ్వర్లు( KCR ), తాతా వెంకట నాగకార్తీక్, సభ్యులు గుర్రం చిన్నఅల్లూరయ్య(GCA), కోలా శ్రీనివాసమూర్తి (ఎంపీడీవో ఆఫీస్), వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.