తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీ దండుబాటు వద్ద ఉన్న శ్రీశ్రీశ్రీ కోటమ్మ తల్లి దేవస్థానంలో ద్వితీయ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, సంకీర్తనలు, ప్రవచనాలతో కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి దర్శనార్థం తండోపతండాలుగా భక్తులు భారీ సంఖ్యలో హాజరై ఆశీర్వచనాలు పొందారు. తర్వాత భక్తులకు అన్నసంతర్పణను నిర్వహించారు.సాయంత్రం నిర్వహించిన గ్రామోత్సవం, కోలాటాలు, డప్పుల నృత్యాలు విశేష ఆకర్షణగా నిలిచాయి. దేవాలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మరియు నిర్వాహకులు మాట్లాడుతూ—
“కోటమ్మ తల్లి మహిమాన్వితమైన శక్తి స్వరూపిణి. శతాబ్దాలుగా సోమరాజు కాలం నుంచే ఈ ఆలయం విశిష్ట ప్రాచుర్యంలో ఉంది. సోమరాజు ఆస్థాన కవులు శ్రీనాథుడు, పిల్లలమర్రి పిన వీరభద్రుడు అమ్మవారిని సేవించి కవితా వాక్కులు పొందారని చరిత్ర చెబుతోంది. ఆర్కాట్ నవాబులు కూడా అమ్మవారిని సేవించి శాప విమోచనం పొందినట్టు శాసనాల్లో ఉంది” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వేల్పుల నందయ్య, నరగా సుబ్బారావు, కొనికి కృష్ణారావు, శ్రీను, రాంబాబు, సుధాకర్, శీలం రామకోటిబాబు, అలాగే ఆధ్యాత్మిక ప్రవచనకారులు ఆత్మానంద స్వామి, కొల్లూరు సత్యనారాయణ, దాసరి యానాదిరావు, ఉపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *