తొలి శుభోదయం బాపట్ల:-
బాపట్ల జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారివారి ఆదేశాలతో బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి నాగార్జున రావు గురువారం జమ్ములపాలెం ఆనంద నగర్ కాలనీలో డెంగ్యూతో బాధపడుతున్న రోగిని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యశాఖ సిబ్బందితో సమావేశమై పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో వెంటనే ఇండోర్ స్ప్రే, ఏ ఎల్ ఓ, రాత్రిపూట ఫాగింగ్ కార్యక్రమము, ఇంటింటా ఫీవర్ సర్వే చేసి తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. గ్రామంలో వెంటనే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు క్షేత్రస్థాయి సిబ్బంది ఊరిలో ఎక్కడ జ్వరం కేసు ఉన్న వెంటనే స్పందించి దగ్గరలో వైద్యశాలకు పంపాలన్నారు. గ్రామంలో కలిగి తిరుగుతూ నీటి నిలువలను గుర్తించి వెంటనే అబ్బట్ రసాయనాన్ని పిచికారి చేయించారు. తొట్లలో నిలువ నీరును పారబోయించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఎడిమిక్ సెల్ సూపర్వైజర్శ్రీ రవి, మలేరియా సబ్ యూనిట్ అధికారి షకీల్ పాల్గొన్నారు