తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పటిష్టత మరియు కేసుల విచారణలో పారదర్శకతే లక్ష్యంగా సింగరాయకొండ సీఐ జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని కేసు డైరీలు, సీ.డి. ఫైళ్లు మరియు ఇతర అధికారిక రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి, బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని మరియు ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా వేగవంతమైన దర్యాప్తు జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణలో ఖచ్చితత్వం పాటించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని సూచిస్తూ, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యం కావాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జరుగుమల్లి పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *