తొలి శుభోదయం కందుకూరు:-
16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా స్థాయి లో నిర్వహించిన డిబేట్, క్విజ్ మరియు వ్యాసరచన పోటీల్లో సీనియర్ విభాగంలో కందుకూరు టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కు చెందిన విద్యార్థినీ విద్యార్థులు అన్ని విభాగాల్లోనూ బహుమతులు సాధించారు. సీనియర్ విభాగంలో టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు చెందిన ఇంగ్లీష్ లిటరేచర్ ఫైనల్ ఇయర్ విద్యార్థి కే.శివకుమార్, డిబేట్ లో ప్రథమ బహుమతి, అదే కళాశాలకు చెందిన ఇంగ్లీష్ లిటరేచర్ మూడవ సంవత్సర విద్యార్థి ఆర్. మహేష్, క్విజ్ లో రెండవ బహుమతి, బీకాం కంప్యూటర్స్ మూడో సంవత్సర విద్యార్థిని, ఎస్. కే. సైదాబీ, వ్యాసరచనపోటీలో రెండవ బహుమతి సాధించడం జరిగింది. ఈ విద్యార్థులు, అందరి కీ ఆదివారం నెల్లూరు కలెక్టర్ వారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బహుమతులు అందజేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలోని 8 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు, మూడు సీనియర్ విభాగాల్లో పోటీలు జరగగా అన్ని విభాగాల్లో కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవి కుమార్ తెలియజేశారు. ఈ పోటీల్లో గెలిచిన విద్యార్థినీ విద్యార్థులను ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు అభినందించారు.