77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

తొలి శుభోదయం ప్రకాశం:-

భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన చారిత్రక సందర్భాన్ని గౌరవిస్తూ, జిల్లా లోని పోలీస్ అధికారులు, సిబ్బంది తమ తమ పోలీస్ స్టేషన్లలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రజలతో పాటు పిల్లలతో కలిసి వేడుకల్లో పాల్గొని, దేశభక్తి భావాలను పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, చట్టబద్ధమైన పాలన పట్ల అవగాహన కల్పిస్తూ, ప్రజలకు మరింత సమీపంగా పోలీసులు ఉండాలనే సందేశాన్ని ఈ వేడుకల ద్వారా చాటి చెప్పారు.ప్రకాశం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *