తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాలతో పిసిఆర్ మరియు డ్రోన్ కెమెరాల ఇంచార్జి ఇన్స్పెక్టర్ దుర్గప్రసాద్ అధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ వద్ద కాలేజిల వద్ద ఆకాశ మార్గం లో డ్రోన్ కెమెరాలతో పహార నిర్వహించడం జరిగింది.విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవాలని, వారి లక్ష్యాలను చేరుకొవాలనే సంకల్పంతో స్కూల్, కాలేజి టైమింగ్స్ లో పోలీసు బీట్స్ తోపాటు ఆకాశ మార్గం లో డ్రోన్ కెమెరాలతో పహార నిర్వహించడం జరిగింది.మోటర్ సైకిల్స్ పైన ఆటోలో విద్యార్థులు స్కూల్స్ కు , కాలేజిలకు వెళ్ళుతున్న సమయంలో అకతాయలు అల్లర్లు చేసిన భరతం పెట్టేందుకు నిఘా ఎర్పాటు చేయడం జరిగింది.అంతేకాకుండా ర్యాగింగ్, ఈవ్ టెజింగ్ కు పాల్పడిన అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు.తోటి విద్యార్థుల పట్ల ప్రతి ఒక్కరూ.. మర్యాదగా వ్యవహరించాలన్నారు.విద్యార్థుల పట్ల ఎవరైనా అమర్యాదగా వ్యవహరిస్తే… వెంటనే స్ధానిక పోలీసు వారి ఫిర్యాదు చేయాలన్నారు.తల్లిదండ్రులు కూడా మీ బిడ్డలను స్కూల్స్ వద్ద, కాలేజీల వద్ద డ్రాప్ చేసిన సమయంలో పరిసర ప్రాంతాలను గమనించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.తల్లిదండ్రులకు స్కూల్స్ వద్ద ఎవరిపైన అయిన అనుమానం వస్తే.. వేంటనే పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు.ప్రభుత్వ, ప్రైవేటు సంబంధించిన ప్రతి స్కూల్స్, కాలేజిల వద్ద బయట రోడ్డు కనపడే మార్గం లో సీసీ కెమెరాలు లేని పక్షంలో సీసికెమెరాలు ఎర్పాటు చేసుకొనే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొవాలన్నారు.ఇలా సిసి కెమెరాలు ఎర్పాటు చేసుకుంటే మీ పరిసర ప్రాంతంలో ఎం జరుగుతుందో మీకు అర్ధం అవుతుందన్నారు.విద్యార్థులు స్కూల్స్ వచ్చే ముందు ఉదయం, సాయంత్రం ఒక ఆరగంట పాటు ఉపాధ్యాయులు బయట పరిసరాలకు గమనిస్తూ ఉంటే బయట ఎం జరుగుతుందొ ఇట్టే అర్ధమౌతుందని ఎస్పీ అన్నారు.కాలేజి వద్ద కాని, స్కూల్స్ వద్ద కాని ఇబ్బందులు పెట్టిన, అల్లర్లు చేసిన అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *