తొలి శుభోదయం టంగుటూరు:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, టంగుటూరు టోల్ గేట్ వద్ద ఒంగోలు వైపు వెళ్లే వాహనాలపై సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, హెల్మెట్, సీట్‌బెల్ట్ వంటి అంశాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు చట్టపరమైన చర్యలు చేపట్టడంతో పాటు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.