తొలి శుభోదయం కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కందుకూరు నందు ఈనెల 11వ తారీఖున పూర్వ విద్యార్థుల సమావేశం జరుగుతుందని కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి శ్రీ యస్. ఏసుదాస్ మరియు పూర్వ విద్యార్థులు, శ్రీ మంచిరాజు మురళీమోహన్, శ్రీ రావులకొల్లు వెంకటేశ్వర్లు గార్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థుల కార్యనిర్వాహక వర్గాన్ని పునర్ వ్యవస్థీకరణ చేయడం జరుగుతుందని తెలియజేశారు. కావున కందుకూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులందరూ టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో 10.30 నిమిషాలకు జరుగు సమావేశానికి హాజరు కాగలరు.