కందుకూరు మండలంలోని 19 పంచాయతీలకు పంపిణీ
స్వర్ణఆంధ్ర – స్వచ్ఛఆంధ్రకు సహకరించాలని ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా… కందుకూరు మండలంలోని 19 పంచాయతీలకు చెత్తతరలింపు వాహనాలను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలంలోని మోపాడు, ఓగూరు పంచాయతీలకు.. ఒక్కొక్కటి 8.5 లక్షలు విలువచేసే ట్రాక్టర్లను ఎమ్మెల్యే నాగేశ్వరరావు పంపిణీ చేశారు. అలాగే గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణకు వీలుగా 32 రిక్షాలను కూడా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా మరియు ఆరోగ్యకరంగా మార్చేందుకు స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 55 కోట్లతో 93 ట్రాక్టర్లను పంపిణీ చేస్తోందన్నారు. రెండువేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ ఇస్తున్నారని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 12 వేల రిక్షాలు, 5 వేల తోపుడుబండ్లను అందిస్తోందని … గ్రామాల్లో చెత్తను సరైన విధానంలో సేకరించేందుకు, అక్కడ నుంచి… చెత్త నుండి సంపద తయారీకేంద్రాలకు తరలించేందుకు, ఈ వాహనాలు ఉపయోగపడతాయని అన్నారు. ప్రజలంతా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛఆంధ్రగా మార్చేందుకు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు ట్రాక్టర్ ను కొద్దిసేపు సరదాగా నడిపారు. వాహనాలను జాగ్రత్తగా ఉపయోగించాలని, చెత్త సేకరణలో బాధ్యతగా విధులు నిర్వర్తించాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నరిశెట్టివారిపాలెం సర్పంచ్ ముప్పాళ్ళ శ్రీను, నియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు బొద్దులూరి కొండలరావు, పచ్చవ తిరుపతిస్వామి, భోగినేని వెంకటేశ్వర్లు, రాయపాటి శ్రీను, గొంది నర్సింగరావు, సూరం చిరంజీవిరెడ్డి, నాదెళ్ల మాధవ, వంకదారి శ్రీను, రెబ్బవరపు మాల్యాద్రి, ఈదర నరసయ్య, రావుల రవి, పంచాయతీ శాఖ అధికారులు పాల్గొన్నారు.