తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ట్రాఫిక్ సీఐ జగదీష్ ఆధ్వర్యంలో, మంగమూరు రోడ్‌లోని ఉమా మహేశ్వర జూనియర్ కాలేజీలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలు, హెల్మెట్ & సీట్‌బెల్ట్ ప్రాముఖ్యత, ట్రాఫిక్ సిగ్నల్స్, వేగ అతిక్రమణ ప్రమాదాలు, మైనర్ డ్రైవింగ్ ప్రభావాలు మరియు డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు.ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలు తప్పనిసరి అని, ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతపై బాధ్యతాయుతంగా ఉండాలని సీఐ జగదీష్ సూచించారు. ట్రాఫిక్ అవగాహన ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని కూడా పేర్కొన్నారు.కార్యక్రమంలో విద్యార్థులు ట్రాఫిక్ పోలీసులతో పరస్పర చర్చలు జరిపి పలు ప్రశ్నలు అడిగి అవగాహన పెంచుకున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *