తొలి శుభోదయం సింగరాయకొండ:-
ఇటీవల స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా సింగరాయకొండ గ్రామపంచాయతీకి శాంక్షన్ అయినా తడి చెత్త పొడి చెత్త సేకరణ ప్రత్యేక బ్యాటరీ వాహనాన్ని సర్పంచ్ తాటిపర్తి వనజ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ సింగరాయకొండ లో భాగంగా చెత్త సేకరణకు ఈ ప్రత్యేక బ్యాటరీ వాహనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రత్యేక వాహనాన్ని సింగరాయకొండ గ్రామపంచాయతీకి సాంక్షన్ చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసినారు
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మండల అభివృద్ధి అధికారి, ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి ఆర్ రమేష్ బాబు ,ఉపసర్పంచ్ ఓలేటి రవిశంకర్ రెడ్డి , పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.