తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

ఒంగోలు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ , ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన తదుపరి
ఒంగోలు నగరంలోని అద్దంకి బస్ స్టాండ్ నందు దామచర్ల ఆంజనేయులు గారు, ఎన్టీఆర్ గారు, పునుగుపాటి కోటేశ్వరరావు గారి విగ్రహాలకు నివాళులు అర్పించి పార్టీ కార్యాలయం లో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ కార్యాలయంలోని విగ్రహాలకు నివాళులు అర్పించడం జరిగినది.తదుపరి ఒంగోలు నగరంలోని MS ఫంక్షన్ హల్ నందు ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి వేడుకల్లో జనార్దన్ గారు పాల్గొన్నడం జరిగినది. అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని స్మరించుకుంటూ, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వాన్ని, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారి ప్రగతిశీల కృషిని ఏవి రూపంలో ప్రదర్శించడం జరిగినది. పార్టీ స్థాపన నుంచి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన సీనియర్ కార్యకర్తలను గుర్తించి ఘనంగా సన్మానించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మరియు ప్రస్తుతం బాగా పనిచేసిన నాయకులను కూడా గుర్తించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జనార్దన్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక చారిత్రాత్మక అవసరం – అది తెలుగువారి ఆత్మగౌరవ ఉద్యమం” అని పేర్కొన్నారు. మార్చి 29న జరుపుకుంటున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్తకు, అభిమానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అది కేవలం రాజకీయ పార్టీ కాకుండా ఒక మహత్తర సామాజిక ఉద్యమమని తెలిపారు. “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే నినాదంతో పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పార్టీ ముందుకు సాగిందన్నారు.
ఎన్టీఆర్ గారి సంక్షేమ కార్యక్రమాలు, పాలనా సంస్కరణలు విస్తృతమైనవని వివరించారు
తెలుగుదేశం పార్టీని అంతం చేస్తామన్న వారు అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎక్కడా లేని స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు మద్దతు , స్త్రీ శక్తి” ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకాలను ప్రజలకు అందించడం జరుగుతున్నది తెలిపారు. కష్టపడిన కార్యకర్తలను గుర్తించి గౌరవిస్తున్నామని
భవిష్యత్తులో కూడా కష్టపడిన వారిని గుర్తించి ప్రోత్సహిస్తామని ,గతంలో అధికారంలో ఉన్న వారు అహంకారంతో ఉండడం వల్లే 151 సీట్ల నుంచి 11కి పడిపోయారని విమర్శించారు. ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఒంగోలు అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఏత్తున పాల్గొన్నడం జరిగినది…

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *