తొలి శుభోదయం కనిగిరి:-

కనిగిరి ఏపీఎస్ ఆర్టీసీ డిపో గ్యారేజి లో పని చేస్తున్న ఔట్సోరిసింగ్ అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం కార్మికులు ఆర్టీసీ డిపో అధికారులకు మరియు తాసిల్దార్ జయలక్ష్మి కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు మాట్లాడుతూ కనిగిరి డిపో నందు గత 10 సంవత్సరాల నుండి అవుట్ సోర్సింగ్ కార్మికులను( స్వీపింగ్, మాపింగ్, వాషింగ్ ) అక్రమంగా తొలగించడం వలన వారి కుటుంబాలు వీదిన పడ్డాయాని డిపో అధికారులు,టెండర్ వేసిన కాంట్రాక్టర్ తో కాకుండా బినామీ కాంట్రాక్టర్ తో కుమ్మక్కై అనేక యేండ్లు గా పనిచేస్తున్న కార్మికుల పొట్ట కొట్టారన్నారు. గత నాలుగు నెలల నుండి ఈ సమస్యను పరిష్కారం చెయ్యడం లో అధికారులు తగిన శ్రద్ద పెట్టడం లేదు అని ఇప్పటికైనా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కాంట్రాక్టర్ మారినప్పుడల్లా కార్మికులను మార్చుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్యారేజ్ తొలగించిన అవుట్ సోర్సింగ్ కార్మికులను పని లోకి తీసుకోవాలని పనిలోకి తీసుకోకపోతే కార్మికులు పోరాటానికి సిద్ధం చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం లో సీఐటీయూ కనిగిరి మండల కన్వీనర్ పి నరేంద్ర అవుట్ సోర్సింగ్ కార్మికులుదేవదాసు, అడివయ్య, గురవయ్య, వేణుగోపాల్, ప్రసాద్, చెన్నారెడ్డి, ఇశ్రాయల్, రామయ్య, శాంతకుమారి, సాలమ్మా, శైలజ,అచ్చమ్మ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు .

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *