తొలి శుభోదయం ప్రకాశం :-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై అర్థరాత్రి 1 గంట నుంచి ఉదయం 4:30 గంటల వరకు ప్రత్యేకంగా ‘Face Wash & Go’ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా హైవేలపై ప్రయాణిస్తున్న వాహనాలను నిలిపివేసి, డ్రైవర్లు నిద్ర మత్తు కారణంగా ప్రమాదాలకు గురికాకుండా ముఖం కడుక్కోవడం, టీ తాగడం ద్వారా అప్రమత్తంగా ప్రయాణం కొనసాగించాల్సిందిగా పోలీసులు సూచించారు డ్రైవింగ్ సమయంలో కుటుంబ సభ్యుల భద్రతను గుర్తు చేసుకుని జాగ్రత్తగా వాహనం నడపాలని, చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచేందుకు ఇలాంటి ప్రజా భద్రతా కార్యక్రమాలను కొనసాగిస్తామని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *