తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రజలకు నూతన క్రిమినల్ చట్టాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు నూతన క్రిమినల్ చట్టాల్లో వచ్చిన ముఖ్యమైన మార్పులు, ప్రజల హక్కులు–బాధ్యతలు, చట్టాల అమలు విధానం తదితర అంశాలను ప్రజలకు వివరించారు. నూతన చట్టాల ద్వారా న్యాయం వేగంగా అందే విధానం, నేరాల నియంత్రణలో ప్రజల పాత్ర ఎంత ముఖ్యమో తెలియజేశారు.అలాగే చట్టపాలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నేరాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు. ప్రజల్లో చట్టాలపై అవగాహన పెరిగినప్పుడే శాంతిభద్రతలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.ప్రజలతో పోలీసుల మధ్య విశ్వాసం, సమన్వయం పెంపొందించడమే ఈ అవగాహన కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని, జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *