తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

రాష్ట్రం లో గ్రామ పంచాయతీ పాలక వర్గాలు, సర్పంచ్ ల పదవీకాలం ముగిసిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో ప్రకాశం జిల్లాలోని గ్రామ పంచాయతీల పాలనకు ప్రత్యేక అధికారుల ను నియమించారు. దానిలో భాగంగా సింగరాయకొండ మండలం లోని పది గ్రామ పంచాయతీ లకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారులను నియమించారు. దానిలో భాగంగా మేజర్ గ్రామ పంచాయతీ ఆయన సింగరాయకొండ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గా మండల తహసీల్దార్ ఎన్ వి బి రాజేష్ ని నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కలికవాయ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గా మండల వ్యవసాయ అధికారి టి. పూర్ణ చంద్ర రావు ని నియమించారు. అదేవిధంగా సోమరాజు పల్లి కి మండల పరిషత్ అధికారి కార్యాలయం ( ఎస్ జి ఎస్ డబ్ల్యూ) డి వెంకట్రావు,పాకల మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసరావు, ఊళ్లపాలెం రెండవ విద్యాశాఖ అధికారి ఆవుల శ్రీనివాసరావు, కనుమళ్ళ,మూలగుంట పాడు మండల అభివృద్ధి అధికారి, శానంపూడి తహసీల్దార్ ప్రసాద్, బంగినపల్లి, పాత సింగరాయకొండ లకి ఎన్ హజరత్ వి ఎ ఎస్ సింగరాయకొండ ని ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల మూడవ తేదీ నుండి గ్రామ ప్రభుత్వాల పాపాన ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లో కొనసాగనుంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *