తొలి శుభోదయం ప్రకాశం, మార్కాపురం పోలీస్ :-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ,డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులతో కలిసి నేరాల నివారణ మరియు సామాజిక భద్రతపై విస్తృత స్థాయి అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలు (Cyber Crimes), గంజాయి మరియు మత్తు పదార్థాల అక్రమ రవాణా, బాల్య వివాహాల నివారణ, చైన్ స్నాచింగ్ పట్ల అప్రమత్తత, మరియు మహిళలపై జరుగుతున్న నేరాల (CAW) అదుపునకు ఉన్న చట్టాలపై మహిళలకు సమగ్రమైన అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నూతన క్రిమినల్ చట్టాల (NCL) పట్ల ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచించారు. సదస్సు అనంతరం పోలీసు అధికారులు, డ్వాక్రా మహిళలు కలిసి పట్టణ ప్రధాన వీధుల్లో ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపారు. శాంతిభద్రతల పరిరక్షణలో మహిళల పాత్ర కీలకమని, సమాజంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని ఈ సందర్భంగా పోలీసులు పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *