తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) తన కార్యాలయంలో సర్కిల్ పరిధిలోని ఎస్.ఐలు, రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు మరియు టీఏ (TA) లతో ప్రత్యేక క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని సీఐ సమీక్షించారు.ముఖ్యంగా కోర్టు కేసుల సత్వర పరిష్కారం, నాన్-బెయిలబుల్ వారెంట్ల (NBW) అమలు, మరియు పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణలో రైటర్లు మరియు అసిస్టెంట్ రైటర్లు అప్రమత్తంగా ఉండాలని, సాంకేతిక అంశాలపై టీఏలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంలో సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, క్రైమ్ రేటును తగ్గించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సీఐ స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *