తొలి శుభోదయం కందుకూరు :-

న్యాయ దినోత్సవం (Law Day )సందర్భంగా బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని గాయత్రి డిగ్రీ కళాశాల నందు మండల న్యాయ సేవా అధికార సంఘం వారి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగినది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయవాదులు పోకూరి కోటయ్య, ముప్పవరపు కిషోర్, పండిత్ సంపత్ కుమార్, షేక్ జమీర్ పాల్గొని మాట్లాడుతూ భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగం ఆమోదించబడిన రోజునే లాడేగా జరుపుకుంటారని న్యాయ సేవలు పొందే హక్కు రాజ్యాంగం ప్రజలందరికి కల్పించిందని అన్నారు . భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, పౌరులకు విధులుతోపాటు బాధ్యతలను అందించిందని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, లౌకిక, సామ్యవాద ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం పౌరులకు కల్పించింది విద్యార్థులు చదువులతోపాటు రాజ్యాంగం కల్పించిన హక్కులు విధులను, సమాజాన్ని అధ్యయనం చేసి క్యారెక్టర్ తో ఉత్తమ పౌరులుగా మెలగాలని సూచించారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో గాయత్రి కళాశాల చైర్మన్ సిహెచ్. రామకృష్ణా రావు, డైరెక్టర్ సిహెచ్ భరద్వాజ్, ప్రిన్సిపల్ గీతా శ్రీనివాసులు, అధ్యాపకులు తుమ్మా. చెన్నయ్య, అక్షరాజ్, కె నవీన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *