తొలి శుభోదయం కందుకూరు:-

కందుకూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో పోస్టర్ ను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం ఆవిష్కరించారు. సబ్ కలెక్టర్ దామెర హిమవంశీతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఐదు సంవత్సరముల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని, సమీపంలోని పోలియో కేంద్రాలకు పిల్లలను తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. కందుకూరు నియోజకవర్గాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో Dy. DMHO డాక్టర్ పి రమేష్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు Dr.P. బ్యూలా గ్రేస్, Dr.P. స్టెల్లా కారుణ్య, పీహెచ్ఎన్
ఐ.పద్మావతి పాల్గొన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *