తొలి శుభోదయం పొన్నలూరు:-

ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో అగ్రహారంలో బుధవారం యలమందల మాల్యాద్రి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటూ వారి అడుగుజాడల్లో నడుస్తున్న నాయకులు మా పొన్నలూరు మండలం జనసైనికులు. ఐక్యతగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండేటువంటి నాయకులు మా పొన్నలూరు జనసైనికులు, ఇప్పటివరకు జరిగిన పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయే పార్టీ కార్యక్రమాలు, గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు పార్టీ అభివృద్ధి దిశగా క్యాడర్ మరియు లీడర్ పనితీరు, కూటమి ధర్మాన్ని పాటిస్తూ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో జనసేన పాత్ర, పార్టీ విధివిధానాలు, పార్టీ క్రమశిక్షణ మొదలైన అంశాల గురించి క్లుప్తంగా చర్చించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కర్ణ తిరుమలరెడ్డి (మండల ఉపాధ్యక్షులు), షేక్ ఖాజావలి (మండల ఉపాధ్యక్షులు), దొరడ్ల సుబ్రహ్మణ్యం నాయుడు (మండల ప్రధాన కార్యదర్శి), యలమందల మాల్యాద్రి, పత్తిపాటి మాధవరావు, గోగన చిన్నబాబు, నల్లపు బ్రహ్మయ్య, ఎనిమిరెడ్డి మాల్యాద్రి, మువ్వా చిన్న, తాళ్లూరు నరసయ్య, మువ్వ కోటేష్, నంది కౌశిక్, గట్టిబోయిన మాధవ, మువ్వా నాని, పులి రాజేష్, గట్టిబోయిన మహేష్, జనిగర్ల అశోక్, గట్టిబోయిన మనోజ్, నగరికంటి రాము, లక్ష్మణ్ రెడ్డి, జనిగర్ల సాయి కిరణ్, మిడసల అనిల్, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, ఖాదర్ బాషా, వెంకట్ రెడ్డి పొన్నలూరు మండలం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *