తొలి శుభోదయం పొదిలి:-
ఈనెల 14, 15 వ తేదీలలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలంలో పాకాల గ్రామంలో రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ” పాకల బీచ్ ఫెస్టివల్” ప్రమోషన్ లో భాగంగా మంగళవారం పొదిలి పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు , రాష్ట్ర మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ,ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, దర్శి టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు అతిథులు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాకల బీచ్ ఎంతో సుందరంగా ఉంటుందని ఈ బీచ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నామని ఈనెల 14 మరియు 15వ తేదీలలో పాకాల బీచ్ లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడింగులు, వివిధ రకాల బోట్లు అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం 2k run ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, పొదిలి మండల ప్రజలు పాల్గొన్నారు.