తొలి శుభోదయం సింగరాయకొండ:-
పాఠశాలలో పతంగుల పండుగ – సంక్రాంతి వేడుకలు
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సింగరాయకొండ మండలంలోని గవదగట్ల వారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు ఆధ్వర్యంలో పతంగుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గాలిపటాల పోటీలు, ముగ్గుల పోటీలు, సంప్రదాయ వస్త్ర ధారణ పోటీలు నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ వాణి, గ్రామ కన్వీనర్ సవిడిబోయిన మురళి పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు చిన్ననాటి నుండి సంస్కృతి సంప్రదాయాలను అలవాటు చేయడం సంతోషకరమని బాల్యం నుంచి క్రమశిక్షణ విలువలతో కూడిన విద్య అందిస్తున్న ఉపాధ్యాయులనుఅభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజయ్ చౌదరి,తల్లిదండ్రులు,గ్రామస్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.