తొలి శుభోదయం ప్రకాశం:-

రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ అన్నారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా కొండపి మండలం ముప్పవరంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు వైద్య ఆరోగ్య శిబిరంలో మంత్రి డా.స్వామి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడి రైతులకు పశుదాణా, మందులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…. పాడి పరిశ్రమ అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. పశువులు ఆరోగ్యంగానే ఉంటేనే పాడి సమృద్ధిగా ఉంటుంది. పశువుల ఆరోగ్యానికీ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. పశువుల ఆరోగ్య పరిరక్షణకు జిల్లాలోని అన్ని మండలాల్లో పశు వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పశువుల కోసం 90 శాతం సబ్సిడీతో మినీ గోకులాలు నిర్మించాం, పశువుల హాస్టళ్లు ఏర్పాటు చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దేశ్యం. దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పాడి రైతులకు సబ్సిడీకి దాణా, పశుగ్రాసం, మినరల్ మిక్చర్ ఇస్తున్నాం, పాడి రైతులకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *