తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు పేకాట శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు.జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో నిందితులను అరెస్టు చేసి, నగదు, మొబైల్ ఫోన్లు, బైకులు ను స్వాధీనం చేసుకున్నారు.ప్రజలు ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా పేకాట లేదా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్న సమాచారం లభించిన వెంటనే Dial 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి.ప్రకాశం జిల్లా పోలీసులు చట్టం అమలు, ప్రజా భద్రత కోసం నిరంతరంగా కట్టుదిట్టమైన పహారా కొనసాగిస్తున్నారు.