తొలి శుభోదయం కందుకూరు:-

కందుకూరులో కుల, మతాలకతీతంగా గత 5 సంవత్సరాలనుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో
నిరుపేదలు అయిన వితంతవులకు, వృద్దులకు ఇంటికి సరిపడ బియ్యం తో పాటు 15 రకాల నిత్యావసర సరుకులు ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలుపుతూ,ప్రతి ఒక్కరు పేదవారికోసం సామాజిక బాధ్యతగా తోచినంత సహాయం అందిస్తే మరింత మందికి సహాయం అందించే దిశగా ఫౌండేషన్ అడుగులు వేస్తుంది అని ఫౌండేషన్ సెక్రెటరీ షంషేర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సాజిద్, ట్రజరర్ హాఫీజ్, టౌన్ ఇంచార్జ్ అయూబ్ ఖాన్ పఠాన్, షంషూద్దిన్ పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *