తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / కొండపి,:-

పేదల వైద్యం, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. కొండపి సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న మరమ్మత్తు పనులు, ప్రహరీ గోడ నిర్మాణ పనులు బుధవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని
అధికారులకు సూచించారు, త్వరగా పనులు పూర్తిచేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పేదల వైద్యం, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసారని విమర్శించారు. నేడు పేద ప్రజలకు అన్ని విధాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *