తొలి శుభోదయం సింగరాయకొండ:-

పోలియో మహమ్మారి నుండి ప్రజలకు రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని దానిలో భాగంగా పోలియో రహిత సింగరాయకొండ కి ప్రతి తల్లి ఈ నెల 21 న జరిగే పల్స్ పోలియో కారక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కొండపి ఎస్ ఎం ఒ, సింగరాయకొండ పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ ధీరేంద్ర కుమార్ పిలుపు ఇచ్చారు. శుక్రవారం సింగరాయకొండ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా డా ధీరేంద్ర కుమార్ మాట్లాడుతూ పోలియో మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు భారత ప్రభుత్వం డబ్ల్యూ హెచ్ ఒ సమన్వయంతో చేపట్టిన ఆరోగ్య భద్రత కార్యక్రమం లో భాగంగా ఆదివారం సింగరాయకొండ మండలం లో చేపట్టిన ప్రత్యేక పల్స్ పోలియో కారక్రమాన్ని విజయవంతం చెయ్యాలని ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో సింగరాయకొండ తీర ప్రాంత గ్రామాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం తో పాటు ఆర్ టి సి బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద కూడా ప్రత్యేక పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తల్లులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయడం లో అశ్రద్ధ చేయవద్దని ఆయను కోరారు. పోలియో చుక్కల కార్యక్రమానికి 40 కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శనివారం సాయంత్రం కల్లా ఆయా గ్రామాల్లో పోలియో చుక్కల మందు సిద్ధంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పాకల మెడికల్ ఆఫీసర్ డా. వంశీ ధర్ పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *