తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో విస్తృత స్థాయిలో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రయాణికులు అధికంగా రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది ముమ్మరంగా విధులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను విచారించడం, ప్రయాణికుల సామాన్లు, బ్యాగ్‌లను పరిశీలించడం, పరిసర ప్రాంతాల్లో నిఘా ఉంచడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ప్రయాణికులతో మాట్లాడి భద్రతాపరమైన సూచనలు అందించారు. ఎవరికైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.ఈ ప్రత్యేక తనిఖీల ద్వారా అవాంఛనీయ ఘటనలను ముందస్తుగా అడ్డుకోవడంతో పాటు, ప్రజల్లో భద్రతపై నమ్మకం పెంపొందించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు మరింత పటిష్టంగా కొనసాగేందుకు ఇలాంటి విజిబుల్ పోలీసింగ్ చర్యలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.